ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం | 6 Migrant Workers Dies In Horrific Road Accident After Speeding Truck Rams Auto In Karnataka, More Details | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం

May 31 2026 5:38 PM | Updated on May 31 2026 6:30 PM

6 Migrant Workers dies in Horrific Road Accident

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి టౌన్ సమీపంలోని జాతీయ రహదారి 44పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోను ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement