మన్యం ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి | YS Jagan Expresses Grief Over Manyam Road Accident | Sakshi
Sakshi News home page

మన్యం ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

May 1 2026 12:42 PM | Updated on May 1 2026 2:26 PM

YS Jagan Expresses Grief Over Manyam Road Accident

సాక్షి, తాడేపల్లి: పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

‘‘సీతంపేట ఘాట్‌ రోడ్‌లో  ఆటో లోయలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. శుభకార్యానికి వెళ్ళి వస్తున్న వారు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరం. మరి కొందరు గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా అని ఓ సందేశం విడుదల చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఓ ఆటో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా.. పాలకొండ-సీతంపేట రూట్‌లోని ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను సీతంపేట ఏజెన్సీకి చెందిన రమణ(ఆటో డ్రైవర్‌), ప్రయాణికులు లక్ష్మి, శాంతి, శ్రావణిలుగా గుర్తించారు. ఐదుగురు చిన్నారులు సహా తొమ్మిదిమందికి గాయాలయ్యాయి.  క్షతగాత్రులకు పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement