కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభత్సం | Benz Car Hits Man on Cable Bridge In Hyderabad | Sakshi
Sakshi News home page

కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభత్సం

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 11:45 AM

Benz Car Hits Man on Cable Bridge In Hyderabad

హైదరాబాద్: కేబుల్‌ బ్రిడ్జిపై వేగంగా వచ్చిన బెంజ్‌కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. మాదాపూర్‌ ఇన్స్‌పెక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపిన మేరకు.. ఘట్కేసర్‌కు చెందిన  శ్యామ్‌రాజ్‌(32) న్యూహఫీజ్‌పేట్‌  అదిత్యనగర్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం తెల్లవారు జామున మాదాపూర్‌ దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిపై ఆగి ఉన్నాడు.  

ఆ సమయంలో జూబ్లిహిల్స్‌ నుంచి ఐకియా వైపు వెళుతున్న బెంజ్‌కారు కారు అతివేగంగా వచ్చి శ్యామ్‌రాజ్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  కారు క్యాంటం మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోల్‌కత్తా పేరుతో ఉందని తెలిపారు. కారు డ్రైవరు పరారయ్యాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement