ఔటర్‌పై రోడ్డు ప్రమాదం | Outer Ring Road Father And Son Incident | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం

Apr 15 2026 11:11 AM | Updated on Apr 15 2026 11:11 AM

Outer Ring Road Father And Son Incident

రంగారెడ్డి జిల్లా: ఔటర్‌ రింగ్‌రోడ్డు డివైడర్‌ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచి్చన కారు ఢీ కొట్టింది.  కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తితోపాటు రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 

వరంగల్‌ హనుమకొండకు చెందిన వేద ప్రకాష్ రెడ్డి (37) భార్య హిమబిందు, కుమారుడు అర్జున్‌ (2)తోపాటు బ«ంధువైన దుర్గాప్రసాద్‌రెడ్డి, అతని భార్య శ్రీజతో కలిసి మంగళవారం హనుమకొండ నుంచి కారులో హైదరాబాద్‌లోని బొంగ్లూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్‌కేసర్‌లో ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వీరి కారు సాయంత్రం 4గంటల సమయంలో పెద్దఅంబర్‌పేట టోల్‌ గేటు దాటి కొంత దూరంగా వెళ్లగానే అప్పటికే డివైడర్‌ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టారు. 

దీంతో కారులో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, అతని కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య హిమబిందు, బంధువైన దుర్గాప్రసాద్‌రెడ్డి, శ్రీజకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సంతో‹Ùనగర్‌లోని డీఆర్‌డీఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement