ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్ చేశారు. ఈ ఆకస్మిక, విషాదకరమైన సంఘటన నా హృదయాన్ని కలిచివేసిందన్నారు. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. గాడ్ ఫాదర్ మూవీ కోసం ఆర్‌బీ చౌదరితో కలిసి పనిచేశానని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఆయన ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్‌లను తీర్చిదిద్దారని మెగాస్టార్ కొనియాడారు. ఒక నిర్మాతగా ఆయన లెక్కలేనన్ని కథలకు జీవం పోశారని తెలిపారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవను మాటల్లో వర్ణించలేమన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నట్లు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు.
సినీ ప్రముఖుల సంతాపం...
ఆర్‌బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్, విశాల్ తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. ఆర్‌బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో చిత్రాలు నిర్మించారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం, నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించారు.
Shocking to hear the news of the demise of the most prolific producer #RBChoudhary sir. Unable to digest this news in the midst of shoot. In a Loss of words. Life is so uncertain. One of the biggest production houses in India. May his soul rest in peace. My deepest condolences… pic.twitter.com/MMPl4PedR6
— Vishal (@VishalKOfficial) May 5, 2026
என் அருமை நண்பர் சூப்பர் குட் ஃப்லிம்ஸ் ஆர்.பி. செளத்ரி அவர்கள் தலை சிறந்த தயாரிப்பாளர். அருமையான மனிதர். எத்தனையோ இளம் இயக்குநர்களுக்கு வாய்ப்பளித்து திரையுலகை வாழவைத்தவர்.
அவருடைய அகால மரணச் செய்தி எனக்கு பேரதிர்ச்சியையும், மிகுந்த வேதனையையும் அளிக்கிறது.
அவர்…— Rajinikanth (@rajinikanth) May 5, 2026
Deeply heartbroken to hear about the sudden and tragic loss of Legendary producer R.B. Choudary garu.
I have known him for many years and was recently associated with him on my film “𝐆𝐨𝐝 𝐅𝐚𝐭𝐡𝐞𝐫” through Super Good Films. He has shaped the careers of many talented… pic.twitter.com/8AXgqF5hew— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2026


