తిరుపతి రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan Expresses Shock Over Fatal Road Accident In Tirupati, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుపతి రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి

Jun 22 2026 1:48 PM | Updated on Jun 22 2026 1:59 PM

YS Jagan React On Tirupati Road accident

సాక్షి, తాడేపల్లి: తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యస్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement