సాయిప్రకాశ్, సంధ్య
ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి.
ఒక్కసారిగా అదుపుతప్పి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారం–పూసుగూడెం మధ్య అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం వల్ల కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయిప్రకాశ్ (28), సంధ్య (25) దంపతులకు మోక్షిత్ (3)గా గుర్తించారు. సాయిప్రకాశ్ తండ్రి శ్రీనివాసరావు ఆరు నెలల క్రితం మృతిచెందగా ములకలపల్లికి చెందిన ఆయన తమ్ముడు కాశీరామేశ్వరం కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో ఉండటం వల్ల సంప్రదాయం ప్రకారం అన్న కుటుంబాన్ని నిద్రకు పిలవడం కుదరలేదు. ఇటీవలే హైదరాబాద్ నుంచి ములకలపల్లి చేరుకున్న ఆయన.. సాయిప్రకాశ్ కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించారు.
దీంతో సాయిప్రకాశ్ తన పెద్ద కుమారుడిని అమ్మమ్మ ఇంట్లో దిగబెట్టి భార్య, చిన్నకుమారుడితోపాటు తల్లి జ్యోతితో కలిసి ఆదివారం ములకలపల్లికి వచ్చారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి బయలుదేరిన 10 నిమిషాలకే మాధారం అటవీ ప్రాంతంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయిప్రకాశ్ డ్రైవింగ్ సీట్లోనే ప్రాణాలు వదలగా ఆయన భార్య, చిన్నకుమారుడు రోడ్డుపై ఎగిరిపడి మృతిచెందారు. ఆయన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 వాహనంలో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, తమ్ముడు మరణించడంతో రిత్విక్ ఒంటరి వాడయ్యాడు. కాగా, కారు నడుతుపున్న సాయికుమార్ చేతిలో పలీ్టపట్టి ఉండటంతో అది తినే క్రమంలో స్టీరింగ్‌పై చెయ్యి వదిలేయడంతో కారు అదుపు తప్పిందా లేక ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ఎస్సై మధుప్రసాద్ వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి స్వగ్రామం బయలుదేరగా..
సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు పమ్రాదంలో స్కూటీపై వెళ్తున్న దంపతులు మృతిచెందారు. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన చందనగిరి దీక్ష, మహేందర్ దంపతులు ఆదివారం ఉదయం స్కూటీపై హైదరాబాద్ నుంచి సొంతూరైన కొండాపూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో లక్డారం గ్రామ శివారులో వ్యవసాయ పొలం పనుల కోసం నాగళ్లు జతచేసిన ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా వెళ్తూ అకస్మాత్తుగా మల్లన్న వనం వద్ద బ్రేక్ కూడా వేశాడు. దీంతో వెనకాల వస్తున్న మహేందర్ దంపతులు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన దీక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లక్డారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నాగపురి స్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరిలో..
ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పర్వతగిరికి చెందిన బుద్దె చరణ్ (16), సోమారం గ్రామానికి చెందిన ఎండీ అహ్మద్ (58), వడ్లకొండకు చెందిన మాజీ సర్పంచ్ వడ్లకొండ ఎల్లాగౌడ్ (58) మృతి చెందారు. చరణ్ అతడి స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు నుంచి పర్వతగిరికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు బైక్‌పై పర్వతగిరి నుంచి సోమారం వైపు వెళ్తున్నారు. వేగంగా వచి్చన ద్విచక్ర వాహనాలు కారంపొడి మిల్లు వద్ద ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. చరణ్ స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది.


