వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి పైగా గాయాలు | RTC Bus Accident In Mahabubnagar Wanaparthy District Leaves More Than 10 Passengers Injured, More Details | Sakshi
Sakshi News home page

వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి పైగా గాయాలు

Jun 29 2026 9:37 AM | Updated on Jun 29 2026 10:08 AM

RTC Bus Accident In Mahabubnagar Wanaparthy District

సాక్షి, మహబూబ్‌నగర్‌: హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి 44 పై బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్ నుంచి వనపర్తి జిల్లా వైపుగా వస్తున్న బస్సు రంగాపూర్ వద్ద ప్రమాదావశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 లో దగ్గరలో గల ఆసుపత్రికి తరలించారు.

అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement