కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది మృతి | Kolkata Hotel Fire Tragedy, 9 Dead And 6 Injured After Massive Blaze Erupts Near Free School Street, Watch Video Inside | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

Aug 19 2026 8:14 AM | Updated on Aug 19 2026 9:43 AM

Kolkata Hotel Fire Tragedy: Few Dead Several Injured News Updates

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్‌ స్ట్రీట్‌ సమీపంలోని ఓ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

మిర్జా గాలిబ్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో రాత్రి సుమారు 2 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు హోటల్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో హోటల్‌లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఫైర్‌ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో హోటల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

చుట్టుపక్కల హోటళ్లకూ మంటలు..
మంటలు ఒక్క హోటల్‌కే పరిమితం కాకుండా సమీపంలోని మరికొన్ని హోటళ్లకు కూడా వ్యాపించినట్లు సమాచారం. దీంతో ఫ్రీ స్కూల్‌ స్ట్రీట్‌, మిర్జా గాలిబ్‌ స్ట్రీట్‌ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు.

వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు మృతి
ఈ ఘటనలో మృతుల్లో పలువురు బంగ్లాదేశ్‌ పౌరులు ఉన్నట్లు సమాచారం. వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన వారు హోటల్‌లో బస చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారి కూడా ఉండటంతో ఘటన మరింత విషాదకరంగా మారింది.

ప్రమాదానికి కారణం?
అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత హోటల్‌ను పరిశీలించి ప్రమాదానికి అసలు కారణాన్ని నిర్ధారించనున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement