భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident at bhadradri kothagudem district | Sakshi
Sakshi News home page

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

Jun 21 2026 9:26 PM | Updated on Jun 21 2026 9:26 PM

road accident at bhadradri kothagudem district

సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. 

ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయి ప్రకాష్, ఆయన భార్య సంధ్య, మరియు వారి కుమారుడు మోక్ష్‌గా పోలీసులు గుర్తించారు. 

ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement