అమ్మా లే.. నాన్నా లే! | Road Accident In Vikarabad District | Sakshi
Sakshi News home page

అమ్మా లే.. నాన్నా లే!

Apr 14 2026 8:00 AM | Updated on Apr 14 2026 8:00 AM

Road Accident In Vikarabad District

తాండూరు రూరల్‌: వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసు కొచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తాండూరు రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమా ర్‌రెడ్డి, బంధువుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణం శాంతినగర్‌కు చెందిన జాళ్ల కవికుమార్‌ (40), పావని (35) దంపతులు. వారికి కార్తీక్, కీర్తన (9) పిల్లలు ఉన్నారు. మే ఒకటి న పావని సోదరుడు రాజ్‌కుమార్‌కు పెళ్లి నిశ్చయ మైంది. 

దీంతో సంప్రదాయం ప్రకారం ఆడపడుచు పుట్టింటి గడపకు పసుపు పూసి బొట్టు పెట్టి పూజలు చేయాలి. అందుకోసం పావని భర్త, పిల్లలతో కలిసి స్కూటీపై ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని పెద్దే ముల్‌ మండలం రుక్మాపూర్‌కు వచ్చింది. పుట్టింట్లో కార్యక్రమం ముగించుకొని సోమవారం ఉదయం 5:15 గంటలకు జహీరాబాద్‌కు తిరిగి స్కూటీపై కుటుంబమంతా బయలుదేరింది. పెద్దేముల్‌ మండలం తట్టేపల్లి వద్దకు రాగానే జహీరాబాద్‌ నుంచి వస్తున్న లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. 

దీంతో కవికుమార్, పావని లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందగా కీర్తన రోడ్డుపై పడటంతో మృతిచెందింది. కార్తీక్‌ మాత్రం ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డాడు. కళ్ల ముందే తల్లిదండ్రులు, చెల్లెలు మృతిచెందడంతో కార్తీక్‌ వారి మృతదేహాల వద్ద విలపిస్తూ అమ్మానాన్న లను లేవాలంటూ బతిమిలా డటం చూపరు లను కంటతడి పెట్టించింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ మహమ్మద్‌ షరీఫ్‌ పెద్దేముల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య తెలిపారు. బాలుడిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement