ఘోర రోడ్డు ప‍్రమాదం.. పది మంది మృతి, 25 మందికి గాయాలు | 10 killed, 18 injured in collision involving bus, truck, pickup van in Bihar's Katihar district: Police. | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప‍్రమాదం.. పది మంది మృతి, 25 మందికి గాయాలు

Apr 11 2026 8:57 PM | Updated on Apr 11 2026 8:57 PM

 10 killed, 18 injured in collision involving bus, truck, pickup van in Bihar's Katihar district: Police.

పట్నా: బిహార్‌లో శనివారం (ఏప్రిల్‌ 11) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటిహార్ జిల్లా వద్ద బస్సు, ట్రక్, పికప్ వాన్ ఢీకొని పది మంది మృతి చెందగా, మరో 25 మందికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.

శనివారం సాయంత్రం ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగిందని ఎస్పీ శిఖర్ చౌధరి మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

"టిహార్ జిల్లా కోఢా పోలీస్ స్టేషన్ పరిధిలో గెరాబారి సమీపంలో బస్సు, పికప్ వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన సుమారు 25 మందికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు" అని కటిహార్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ శిఖర్ చౌధరి తెలపిఇన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement