రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్షిప్రా మృతి | Software Engineer Dies in Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్షిప్రా మృతి

Apr 14 2026 10:34 AM | Updated on Apr 14 2026 10:34 AM

Software Engineer Dies in Road Accident

బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్‌కు ఏకైక కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్‌ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్‌కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. 

ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికి­త్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్‌ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకైక ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement