రోడ్డు దాటుతుండగా విషాదం..! | woman road incident in medak district | Sakshi
Sakshi News home page

రోడ్డు దాటుతుండగా విషాదం..!

Jun 22 2026 11:46 AM | Updated on Jun 22 2026 11:46 AM

woman road incident in medak district

వర్గల్‌(గజ్వేల్‌): బైక్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గృహిణిని కబళించింది. ఈ దుర్ఘటన శనివారం రాత్రి మండలంలోని గౌరారం వద్ద రాజీవ్‌రహదారిపై చోటు చేసుకుంది. గజ్వేల్‌ రూరల్‌ సీఐ రవిరాజు, స్థానికులు కథనం ప్రకారం... గౌరారం గ్రామానికి చెందిన పూదరి వెంకటేశ్‌గౌడ్‌ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య మంజుల(37), పద్మాలుగేళ్లలోపు అనీశ్‌గౌడ్, శాంక్‌గౌడ్‌ ఇద్దరు కుమారులున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి, నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నది. 

మామిడ్యాల కమాన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా చేర్యాలకు చెందిన కాత అజయ్‌ బైక్‌పై హైదరాబాద్‌ వైపు నుంచి మితిమీరిన వేగంతో వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటివరకు బంధుగణంతో, కుటుంబీకులతో మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిన మంజుల కొద్ది సేపట్లోనే మృతిచెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement