అద్దంకి: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం పాలైన ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆదివారం జరిగింది. బల్లికురవ మండలం వైదన కొప్పరపాడుకి చెందిన దమ్ము చిన్న(35) ఏడేళ్లుగా తన భార్య మణిమ్మ స్వగ్రామమైన చక్రాయపాలెం వచ్చి నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కుమారులు.
ఆదివారం ఉదయం పెద్ద కుమారుడు సుశాంత్(12)ను శాంతి నగర్‌లోని బ్రహ్మంగారి ఆరాధనోత్సవం దగ్గర వదిలి రావడానికి మోటారు బైకుపై బయలు దేరాడు. ఈ క్రమంలో చక్రాయపాలెం–శాంతినగర్ గ్రామాల మధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.


