నుజ్జునుజ్జైన కారు.. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం | Karnataka Chitradurga Latest Accident News | Sakshi
Sakshi News home page

నుజ్జునుజ్జైన కారు.. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం

May 29 2026 6:48 AM | Updated on May 29 2026 8:45 AM

Karnataka Chitradurga Latest Accident News

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి సమీపంలో కారు–లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యిందని తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులు ఉన్నట్లయితే వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్‌ నిద్రమత్తు లేదా నియంత్రణ కోల్పోవడం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజుల కిందట ఇదే జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement