రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌

Jan 9 2026 7:30 AM | Updated on Jan 9 2026 7:30 AM

రాష్ట

రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌

పుణ్యస్నానాలు.. మొక్కులు

చిట్యాల: రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా చిట్యాల మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజ్‌కుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలో రావుల కృష్ణను నియమించారు. తన నియామకానికి కృషిచేసిన వారికి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హాస్టల్‌ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెప్పారు.

మోడల్‌ ఉమెన్స్‌ గ్రామ పంచాయతీగా ఎడపల్లి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం ఎడపల్లి పంచాయతీ జిల్లాస్థాయిలో మోడల్‌ ఉమెన్స్‌ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. సర్పంచ్‌ మోతే నీలరాణిని మహారాష్ట్రలోని పుణేకు శిక్షణ కోసం పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ అధికారులు తీసుకెళ్లారు. 8న గురువారం, 9న శుక్రవారం రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశంలో మహిళా సాధికారత, గ్రామాభివృద్ధి, ఉత్తమ పాలన విధానాలపై విస్తృతంగా జరగనున్న చర్చల్లో పాల్గొంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి 13 మంది ఎంపికయ్యారు. సర్పంచ్‌ను పలువురు అభినందించారు.

రేపు లక్ష తులసి అర్చన

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీరామచంద్రస్వామి ఆలయంలో లక్ష తులసి అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 10న శనివారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.

యువత భవిష్యత్‌ను మార్చేలా సీఎం కప్‌

రేగొండ: క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడలు నిర్వహిస్తుందని జిల్లా విద్యాధికారి రాజేందర్‌ అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డీవైఎస్‌ఓ రఘు ఆధ్వర్యంలో క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో క్రీడలపై అవగాహన కల్పించేందుకు సీఎం కప్‌ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దివ్య, ఎంఈఓ రాజు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత, సీఎంఓ రమేష్‌, ఏఎంఓ విజయ్‌పాల్‌ రెడ్డి, సర్పంచ్‌ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

బస్సు నడిపించాలని డీఎంకు వినతి

కాళేశ్వరం: కాళేశ్వరం వయా మద్దులపల్లి మీదుగా చెన్నూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని మద్దులపల్లి సర్పంచ్‌ ఎల్పుల సరిత భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందుకు గురువారం వినతిపత్రం అందజేశారు. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వయా మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం మీదుగా మంచిర్యాల జిల్లా చెన్నూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని భూపాలపల్లిలో విన్నవించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు మూడు ట్రిప్పులు బస్సు సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేశారు. డీఎం సానుకూలంగా స్పందించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ..

మద్దులపల్లి గ్రామపంచాయతీలో గురువారం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సరిత, ఉపసర్పంచ్‌ లచ్చిరెడ్డి, కార్యదర్శి స్వాతి, వీఏఓ జాడి మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌తాడ్వాయి: గురువారం సమ్మక్క రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు షెవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు ఆరగించారు.

రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌
1
1/2

రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌

రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌
2
2/2

రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement