గురుకులం పిలుస్తోంది..
దరఖాస్తులు ఇలా..
ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మొగుళ్లపల్లి: ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 5 నుంచి 9వ తరగతిలో చేరే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ గురుకుల విద్యాలయాలు ఎంతగానో దోడ్పడుతున్నాయి. ఆంగ్ల మాద్యమంలో బోధిస్తూ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన సీటు కేటాయించనున్నారు. జిల్లాలోని కాటారం, భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ గురుకులాల్లో అడ్మిషన్ పొందేందుకు అర్హత పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అవసరమైన సర్టిఫికెట్లు
ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్ లేదా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, కులం, ఆదాయం జిరాక్స్, పాస్‌ఫొటోతో సమీప మీసేవా కేంద్రంలో సంప్రదించాలి. గ్రామీణ ప్రజల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రజల వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులు.
గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన ఉంటుంది. గురుకులాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. అన్ని పత్రాలతో మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
– ఎస్.శారద, ఎంజేపీ ప్రిన్సిపాల్, మొగుళ్లపల్లి
ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీజీసెట్. సీజీజీ. జీఓవీ. ఇన్ అనే వెబ్‌సైట్ లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈనెల 21వ తేదీ వరకు గడువు
ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష
జిల్లా వ్యాప్తంగా 7 గురుకులాలు
గురుకులం పిలుస్తోంది..


