పన్ను వసూళ్లపై నజర్
జీపీల్లో వందశాతం సేకరణే లక్ష్యం
వందశాతం లక్ష్యంగా..
భూపాలపల్లి రూరల్: గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివిధ రకాల పన్నులను ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.4,30,11,513 లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.1,05,95,987 (24.64 శాతం) వసూలు చేయగా రూ.3,24,15,526 వసూలు చేయాల్సి ఉంది. ఈ ఏడాది వందశాతం వసూళ్లు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పన్నులు వసూలైతేనే నిధులు..
గ్రామ పంచాయతీలు స్వయం పోషకాలుగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. పంచాయతీలు ఇంటిపన్ను, తాగునీటి పన్నుతో పా టు వాణిజ్య దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాయి. ఈ మేరకు ఆయా గ్రామాల్లో కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే గ్రామ అవసరాలకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వ పరంగా ఎస్‌ఎఫ్‌సీ ఆర్థిక సంఘం నుంచి నిధులతో పాటు పలు సందర్భాల్లో పన్నుల రూపేణ వచ్చే నిధులు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వందశాతం పన్ను వసూలు చేసిన గ్రామాలకు మాత్రమే ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో పంచాయతీలు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి.
గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ..
జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లను కార్యదర్శులు అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 24.64 శాతం వసూలు చేశారు. ఆయా గ్రామాల్లో కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. వచ్చిన ఆస్తిపన్ను వివరాలను ఈ–వెబ్‌పైట్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌లోని వివరాల ఆధారంగా కలెక్షన్ బ్యాలెన్స్ (డీసీబీ) పత్రాలను ప్రింట్ తీసి ఈఓపీఆర్‌డీలు కార్యదర్శులకు అందజేస్తారు. అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఈ–పంచాయతీ వెబ్‌సైట్‌లో నమోదు చేయడం ద్వారా పన్ను వసూళ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఇంటింటికీ తిరుగుతున్న కార్యదర్శులు
ఇప్పటివరకు 24.64 శాతం మాత్రమే..
జిల్లాలో 248 పంచాయతీలు
రెండేళ్లుగా 90శాతంపైగా పన్నులు వసూళ్లు చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరం కూడా వందశాతం వసూలు లక్ష్యంగా కృషి చేస్తున్నాం. గత నెలరోజులు కార్యదర్శులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి సారించాం. ప్రతీరోజు అధికారులు, కార్యదర్శులతో గ్రూప్ కాల్స్ చేస్తున్నాం.
– శ్రీలత, డీపీఓ
పన్ను వసూళ్లపై నజర్
పన్ను వసూళ్లపై నజర్


