బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌ | - | Sakshi
Sakshi News home page

బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌

Jan 12 2026 7:34 AM | Updated on Jan 12 2026 7:34 AM

బొగ్గ

బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌

పరీక్ష కేంద్రం తనిఖీ

మల్హర్‌: తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌–2 ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు మండలంలోని మల్లారం (దుబ్బపేట) కస్తూర్భా సమీపంలోని వ్యవసాయ భూముల్లో జీహెచ్‌ఐ కంపెనీ బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌ చేస్తుంది. జీహెచ్‌ఐ కంపెనీ ప్రతినిధులు సదరు వ్యవసాయ భూమిలో ఇప్పటికే 450 మీటర్ల లోతులో డ్రిలింగ్‌ చేపట్టారు. మరో 200 నుంచి 300 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేస్తే బొగ్గు నాణ్యతను గుర్తించవచ్చని అంటున్నారు. ఇప్పటికే పెద్దతూండ్ల కిషన్‌రావుపల్లిలో, తాడిచర్ల శివారులోని పెద్దతూండ్ల ఆరెవాగు వంతెన సమీపంలో డ్రిల్లింగ్‌ వేశారు.

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రాయింగ్‌ లోయర్‌ గ్రేడ్‌ పరీక్షకు 159 మందికి గాను 113 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. డ్రాయింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షకు 50 మంది విద్యార్థులకు 46 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు.

హేమాచలక్షేత్రంలో

భక్తుల సందడి

మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.

బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌
1
1/2

బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌

బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌
2
2/2

బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement