రాజకీయ పరిస్థితులతో అడుగులు
నాది పేద మధ్యతరగతి కుటుంబం. నేను డిగ్రీ(బీఏ) వరకు చదివాను. నా వయస్సు 28 సంవత్సరాలు. కరోనాకు ముందు హైదరాబాద్‌లో ట్రావెల్స్ బిజినెస్ చేసి పరిస్థితులు బాగా లేక మహదేవపూర్ మండలంలోని సొంతం గ్రామం అన్నారం చేరాను. గ్రామంలో చిన్న ఆన్‌లైన్ సెంటర్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్న. ఇంకా ఎన్‌జీఓలో ఆర్‌టీఐ, ఎన్‌హెచ్‌ఆర్‌ఎస్‌లో ప్రజల కోసం పనిచేస్తున్న. గ్రామంలో నెలకొన్న రాజకీయ నాయకుల వైఫల్యాలతో నేను సర్పంచ్‌గా గెలిచి ఊరును బాగు చేయాలని అనిపించింది. ప్రజల సహకారంతో సర్పంచ్‌గా గెలిచాను. ఊరులోని బడి, ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు మధ్యవర్తిత్వం లేకుండా వారికి దరిచేరే విధంగా శ్రమిస్తాను. మౌలిక వసతులపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తా.
– నీర్ల ప్రభాకర్, అన్నారం సర్పంచ్, మహదేవపూర్
●


