ఏజెన్సీల ఇష్టారాజ్యం
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సిబ్బంది నియామకం
భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం ఇష్టారాజ్యంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వారే ఉద్యోగులను ఎంపిక చేసి నియామక పత్రాలను రెండు రోజుల క్రితం అందించినట్లు తెలిసింది. దీంతో అనర్హులు ఉద్యోగాలు పొందగా అర్హులు అన్యాయానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
34 మంది నియామకానికి..
టెక్నికల్, నాన్ టెక్నికల్, పారామెడికల్, ఎలక్ట్రిషన్, ల్యాబ్ అటెండెంట్, అనస్తీషియా, రేడియో గ్రాఫర్ టెక్నీషియన్‌లకు సంబంధించిన 34 మంది నియామకానికి గత నెల 27వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి 30వ తేదీ వరకు అమ్మ సోషల్ సర్వీస్, శ్రీ వినాయక మాన్‌పవర్ సొల్యూషన్స్, శ్రీ వెంకటేశ్వర ఎస్సీ, ఎస్టీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తులను స్వీకరించాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకాలకు సంబంధించిన దరఖాస్తులు సంబంధిత కార్యాలయ అధికారులు స్వీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత ఏజెన్సీలకు జాబితా అందిస్తారు. అనంతరం ఏజెన్సీ నిర్వాహకులు నియమాక పత్రాన్ని అందిస్తారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నియామకాల్లో నిబంధనలు పాటించలేదు.
పరిశీలన లేకుండానే..
34 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన ఏజెన్సీల నిర్వాహకులు పరిశీలనలు చేపట్టకుండానే నియామకాలు ఆదివారం రాత్రి అందించినట్లు తెలిసింది. వచ్చిన పూర్తి దరఖాస్తులను పరిశీలించిన మెరిట్ జాబితాలను పదర్శించిన తరువాత నియామకాలు చేపటాల్సి ఉంటుంది. కలెక్టర్, సంబఽంధిత మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సూపరిటెండెంట్‌కు సైతం సమాచారం లేదు. ఆస్పత్రిలో పనిచేసే వారికి కనీస అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 20 మంది ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి అవకాశం కల్పించలేదు. అనుభవం లేని వారికి రాజకీయ బలం, ధన బలం ఉన్నవారికి నియామక పత్రాలు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. విధులు నిర్వర్తిస్తున్న తమకు అవకాశం కల్పించకపోవడంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సోమవారం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
దరఖాస్తుల స్వీకరణ..
నియామక పత్రాలు అందజేత
కలెక్టర్ స్పందిస్తే అర్హులకు న్యాయం


