వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం నుంచి చలి ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తుంది.
పూరేడు గుట్ట జాతరలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలి. వెంచరామి నుంచి జాతర వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చొరవ తీసుకోవాలి. గతంలో జాతర ఏర్పాట్లకు రూ.30 లక్షల నిధులు కేటాయించారు. శాశ్వత పనులు చేపట్టాలి. రూ.50లక్షల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కోరుతున్నా.
– కాసు రమ, వెంచరామి సర్పంచ్
పూరేడు గుట్ట జాతర పనులు రెండు రోజుల్లో ప్రారంభిస్తాం. జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. భక్తులకు లోటుపాట్లు లేకుండా అధికారులతో కలిసి సమష్టిగా పని చేస్తాం.
– గీతారెడ్డి, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్


