పులుల గణన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పులుల గణన ప్రారంభం

Jan 21 2026 7:07 AM | Updated on Jan 21 2026 7:07 AM

పులుల గణన ప్రారంభం

పులుల గణన ప్రారంభం

కాళేశ్వరం: మహదదేవపూర్‌ మండలం అటవీశాఖ రేంజ్‌ పరిధిలో ఐదు సెక్షన్‌లు, 20 బీట్లలో అఖిల భారత పులుల అంచనా (ఏఐటీఈఎస్‌) 2026 సర్వేను మంగళవారం ప్రారంభించారు. అటవీశాఖ అధికారులు, ఫీల్డ్‌ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు కలిసి మొదటి మూడు రోజుల పాటు ట్రైల్‌ పద్ధతిలో కార్నివోర్స్‌ (మాంసాహార జంతువులు), మె ఘా హెర్బీవోర్స్‌ (పెద్ద శాఖాహార జంతువు)లపై అధ్యాయనం చేయనున్నారు. రెండు నుంచి మూ డు రోజుల పాటు ట్రాన్సెక్ట్‌ లైన్‌ విధానంలో వెజిటేషన్‌ కవర్‌, జీవవైవిధ్యం, శాఖాహార జంతువుల జనాభా, అడవులు ఆరోగ్యం వంటి అంశాలపై వివరాలు సేకరిస్తారు. అలాగే ట్రాక్‌ అండ్‌ సైన్‌ వంటి శాసీ్త్రయ పద్ధతుల ద్వారా సర్వేకొనసాగుతోంది. దీని ద్వారా పులుల సంఖ్యతో పాటు ఇతర వన్యప్రానుల ఉనికి, అడవి జీవవైవిధ్యం జీవావరణ పరి స్థితులపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. సర్వే ఫలితాలు భవిష్యత్‌లో పులుల సంరక్షణ, అడవులు అభివృద్ధి వన్యప్రాణి రక్షణ చర్యలకు కీలకమార్గదర్శకంగా ఉపయోగపడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అ టవీశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement