పోలీస్ యాక్ట్ అమలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ సరిశెట్టి సంకీర్త్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నెల రోజుల పాటు సెక్షన్ 30, 30(ఏ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇతర వ్యక్తులు లేదా రాజకీయ పార్టీలను కించపరిచే వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాధ్యమాలలో అటువంటి పోస్టులు పెట్టినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కేటీకే–5 ఇన్‌కై ్లన్‌లో
భద్రతా పూజ
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే–5వ గనిలో ఆదివారం భద్రతా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన పూజ కార్యక్రమానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం, ఉత్పత్తి తగ్గుదల నేపథ్యంలో, గని భద్రతను మరింత పటిష్టం చేయడం, కార్మికుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో భద్రతా పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. గనిలో భద్రతే అత్యంత ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని స్థాయిల్లో కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తామని తెలిపారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా సమీక్షించి, అవసరమైన సాంకేతిక, పరిపాలనా చర్యలు ఇప్పటికే చేపడుతున్నామన్నారు. ఉత్పత్తి స్థాయిని పునరుద్ధరించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ భద్రతా పూజ కార్యక్రమంలో గని ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, గని మేనేజర్ మాచర్ల రమేష్, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రస్థాయి పోటీలు
భూపాలపల్లి రూరల్: ఇండియన్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 300మంది కళాకారులు హాజరయ్యారు. కళాకా రులు వివిధ నృత్యాలతో అలరించారు. విజేతలకు నిర్వాహకులు షీల్డ్‌లతో పాటు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దుర్గం రమేష్, డ్యాన్స్ అకా డమీ సభ్యులు, డ్యాన్స్‌మాస్టర్లు పాల్గొన్నారు.
జాతరలో నిరంతర విద్యుత్ సరఫరా
హన్మకొండ: మేడారం మహా జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను విజయవంతంగా అందించినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సీఎండీ మేడారంలోనే బస చేసి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి మాట్లాడారు. జాతరలో నిరంతర విద్యుత్ సరఫరా వెనుక ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావం ఉందన్నారు. జాతర విజయవంతం చేయడానికి కృషిచేసిన అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
‘మేడారం మహాజాతర విజయవంతం’
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతర విజయవంతంగా ముగిసిందని మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన భోజరావు అన్నారు. మేడారంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. జాతర నిర్వహణలో ప్రభుత్వం, పూజారులు, ఆదివాసీ యువకులు, సమన్వయంతో పనిచేసినట్లు వివరించారు.


