ఆశావహుల ఎదురుచూపు | - | Sakshi
Sakshi News home page

ఆశావహుల ఎదురుచూపు

Feb 2 2026 7:47 AM | Updated on Feb 2 2026 7:47 AM

ఆశావహుల ఎదురుచూపు

ఆశావహుల ఎదురుచూపు

ఆశావహుల ఎదురుచూపు

మహాశివరాత్రి వరకై నా..

‘కాళేశ్వరం’ ట్రస్టు బోర్డు నియామకం జరిగేనా?

కాళేశ్వరం: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాలయంలో ట్రస్టు బోర్డు నియామకం ఎప్పుడు జరుగుతుందనే అంశంపై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే మహా శివరాత్రి జాతర నాటికి ట్రస్టు బోర్డు ఏర్పాటవుతుందా? లేదా అన్న సందేహాలు పలువురు నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.

పరిశీలనలో ధరఖాస్తులు..

దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు కాళేశ్వరాలయం ట్రస్టు బోర్డు నియామకానికి సంబంధించి 14 మంది డైరెక్టర్లు, ఒక ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఎంపిక కోసం గతేడాది నవంబర్‌ 18న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పలువురు ఆశావహులు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులపై ఎస్బీ పోలీసులు విచారణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ధరఖాస్తులు కమిషనర్‌ పరిశీలించి, ప్రభుత్వానికి అందజేసిట్లు తెలిసింది.

పరిపాటిగా మారిన వాయిదా..

రెండున్నరేళ్లుగా ట్రస్టు బోర్డు నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆపై వాయిదా వేయం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతి నది పుష్కరాలను కూడా ట్రస్టు బోర్డు లేకుండానే ఉత్సవ కమిటీతోనే నిర్వహించారని ఆరోపణలు భక్తులు, ప్రజల్లో ఉన్నాయి.

రూ.30కోట్లతో ప్రతిపాదనలు..

మే 21 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్యపుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్ల వరకు నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. శాశ్వత నిర్మాణాలు, ఆలయ అభివృద్ధి, నిర్వహణ పక్కాగా సాగాలంటే ట్రస్టు బోర్డు నియామకం తప్పనిసరి అన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. చైర్మన్‌ రేసులో మంథనికి చెందిన అవధాని మోహన్‌శర్మ, కాళేశ్వరానికి చెందిన కామిడి శ్రీనివాస్‌రెడ్డి, మెంగాని అఽశోక్‌ పైరవీలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏదేమైనా ట్రస్టుబోర్డు నియామకం జరిపి, ఆలయ నిర్వహణపై గాడిలో పెట్టే వారిని చైర్మన్‌, డైరెక్టర్లుగా నియమించాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.

ఈనెల 15న జరగనున్న మహా శివరాత్రి జాతర వరకై నా ట్రస్టు బోర్డు నియామకం చేస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చైర్మన్‌, డైరెక్టర్‌ల పదవులు ఆశించే ఆశావహులు మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం.

నోటిఫికేషన్‌లు వాయిదా వేయడం పరిపాటి

మంత్రి శ్రీధర్‌బాబుపై

ఆశలు పెట్టుకున్న నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement