బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన
భూపాలపల్లి అర్బన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పై పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర రమేష్, జనార్దన్, మాడ హరీశ్‌రెడ్డి, సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.


