రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి
భూపాలపల్లి: భారత రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సంకీర్త్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం అని, మహనీయులు ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా మనం స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవిస్తున్నామని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో ఘనంగా ప్రగతి సాధించిందని, ఆర్థిక, సాంకేతిక వృద్ధి సాధించామని ఎస్పీ అన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, డీఎస్పీ సంపత్‌రావు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


