విధుల్లో చేరిన ల్యాబ్ టెక్నీషియన్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 24 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో చేరారు. కొత్తగా ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగం సాధించిన వారు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కు నియామక పత్రాలు అప్పగించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌కు పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ ల్యాబ్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుతాయని, సిబ్బంది కొరత తీరడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటరత్నం, ఆర్‌ఎంఓలు, అదనపు డైరెక్టర్‌లు పాల్గొన్నారు.


