కాళేశ్వరాలయంలో సందడి
సంక్రాంతి సెలవుల సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికి తోడు ముందస్తుగా మేడారంలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో కాళేశ్వరాలయం పరిధి గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రాకపోకలు జరుగడంతో గ్రామంలో భక్తుల రద్దీ నెలకొంది. – కాళేశ్వరం
కాళేశ్వరాలయంలో సందడి


