టీకా ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో హెల్త్ కేర్ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. స్థానిక పీహెచ్‌సీలో జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ ఉమాదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి డోసు టీకా ఇవ్వగా, రెండో డోసు ఒక నెల తర్వాత, మూడో డోసు ఆరు నెలల తర్వాత ఇవ్వనున్నట్లు తెలిపారు. హెపటైటిస్–బీ వ్యాక్సిన్ ద్వారా పచ్చకామెర్లు, లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ కేన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు.


