జాతరలో భక్తుల భద్రత కీలకం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తుల భద్రత కీలకమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మేడారం జాతర సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శనివారం రాత్రి సందర్శించారు. జాతర ప్రాంతాలలో సుమారు 450 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై జాతర ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు, జనసాంద్రత పరిస్థితులను మంత్రి సీతక్క ప్రత్యక్షంగా వీక్షించారు. జాతర సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారు, ముందస్తు చర్యలు, సన్నాహాలు ఏమిటన్న అంశాలను పోలీస్ అధికారులు మంత్రికి వివరించారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతీ చిన్న అంశాన్ని కూడా అప్రమత్తతతో పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పోలీస్ అధికారులకు ఆదేశించారు. భక్తులు నిర్భయంగా, ప్రశాంతంగా జాతరలో పాల్గొనేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలని, పోలీస్ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర, ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వేదికను మంత్రి పరిశీలించి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏర్పాట్ల వివరాలను మంత్రి సీతక్కకు వివరించారు. బందోబస్తూ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ దివాకర సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల కోసం నియమించిన ప్రత్యేక అధికారులతో ఆర్డీఓ వెంకటేశ్ సమావేశం నిర్వహించి వారి విధుల నిర్వహణ, ఏర్పాట్లపై సూచనలు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్ల పరిశీలన
జాతరలో భక్తుల భద్రత కీలకం
జాతరలో భక్తుల భద్రత కీలకం


