రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని దామరకుంట సోషల్ వెల్ఫేర్ విదార్థిని మంతెన శ్రీహర్షిని ఎంపికై నట్లు పెద్దపెల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.లక్ష్మణ్, వేల్పుల కుమారు తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు నారాయణపేట జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనున్నట్లు చెప్పారు. విద్యార్థిని ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ నజ్మా, పీడీ రాజేశ్వరి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు.
హేతుబద్ధీకరణను
విరమించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: త్వరలో చేపట్టబోయే హేతుబద్ధీకరణను విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చేపట్టే రైజింగ్ 2047లో భాగమే ఈ హేతుబద్ధీకరణ అని దుయ్యబట్టారు. విద్యారంగానికి సరిపో యే బడ్జెట్ కేటాయించకుండా విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు తిరుపతి, శ్రీనివాసరెడ్డి, దేవేంద్ర, తిరుపతిరెడ్డి, వీరేశం, బోజ్జా నాయక్, వీరన్న, ప్రభాకర్ పాల్గొన్నారు.
పోరుదీక్ష పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి రూరల్: ఈనెల 20న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్నె యుగేందర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో కళాకారులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన్నె యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం తమ ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ సాధించుకున్నామన్నారు. అయినప్పటికీ ఉద్యమ కళాకారులకు ఉపాధి లేకుండా నిరాశ్రయులుగా దీనస్థితిలో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గెం శ్రావణ్, రాజేష్, రాజా, సడవలి, మధుకర్, సమ్మరాజ్, రాజశేఖర్, సంధ్యారాణి, నిర్మల పాల్గొన్నారు.
చెట్లు, స్తంభాలకు రంగులు
ఏటూరునాగారం: మహాజాతర సందర్భంగా వచ్చిపోయే వాహనాలు, భక్తులకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, స్తంభాలు కనిపించే విధంగా ఆర్‌అండ్‌బీశాఖ ఎరుపు, తెలుపు గుర్తులతో ప్రతీ చెట్టుకు, స్తంభానికి కలర్ వేయించారు. దీంతో రోడ్డు వెంట ఏమి ఉన్నాయి, ఎంత దూరం వరకు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులకు, భక్తులకు రక్షణ కల్పించేలా ఈ రంగులు సహాయ పడనున్నాయి.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక


