ఇన్‌చార్జ్ కమిషనర్‌గా జోనా
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఇసంపెల్లి జోనా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉదయ్‌కుమార్ 45 రోజుల వృత్తి శిక్షణకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా మెప్మా ప్రా జెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జోనాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్బంగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సి పాలిటీ ప్రత్యేక అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు.
భూపాలపల్లి అర్బన్: స్కౌట్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్‌గా ఇగురం శ్రవణ్‌ను నియమిస్తూ నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్‌కుమార్ మంగళవారం శ్రవణ్‌కు అందించారు. ఈ నియామకానికి సహకరించిన పలువురి శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న అడిచర్ల శ్రీనివాస్ కోల్ ఇండియా స్థాయి కూచిపూడిలో బంగారు పతకం సాధించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నాగ్‌పూర్‌లోని డబ్ల్యూసీఎల్ కంపెనీలో జరిగిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో శ్రీనివాస్ పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం జీఎం కార్యాలయంలో శ్రీనివాస్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు శ్యాంప్రసాద్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
రేగొండ: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ డీఈ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లూస్ లైన్స్, వంగిన పోల్స్‌ను సరి చేశారు. విద్యుత్ షాక్‌కు గురికాకుండా రైతులకు పలు జాగ్రత్తలను సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ వంగ రాజు, సిబ్బంది సురేష్, నాగరాజు, రాహుల్, విజయ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కమిషనర్‌గా జోనా
ఇన్‌చార్జ్ కమిషనర్‌గా జోనా
ఇన్‌చార్జ్ కమిషనర్‌గా జోనా


