కాళేశ్వర దేవస్థాన క్యాలెండర్ ఆవిష్కరణ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం 2026 క్యాలెండర్‌ను తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ చేతుల మీదుగా ఈఓ మహేష్‌లు అధికారికంగా బుధవారం ఆవిష్కరించారు. వారి వెంట దేవస్థానం అర్చక స్వాములు బైకుంఠపాండా, వెల్ది శరత్‌చంద్ర తదితరులు ఉన్నారు.
చిట్యాల: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బోధన పద్ధతుల విధానాలపై బుధవారం సమగ్ర పర్యవేక్షణ బృందం నాంపల్లి వేణుగోపాల్, మండల విద్యాధికారి కొడేపాక రఘుపతిలు సందర్శించి పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాలు, తరగతి గది కార్యకలాపాలు, విద్యార్థుల లెర్నింగ్ ఔట్స్‌కమ్స్‌తో పాటు బేస్ లైన్, మిడ్‌లైన్ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఉపాధ్యాయుడు బోధన పద్ధతులు అనుసరిస్తూ బోధించడం అభినందనీయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ బృందం సభ్యులు పైడిపాల రమేష్, రతన్‌సింగ్, సూదం సాంబమూర్తి, బాలశౌరి రెడ్డి, రంగరాజు, సతీష్, శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్లస్టర్ పోటీలను బుధవారం రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ హసీనభానోలు ప్రారంభించారు. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పురుషోత్తంరెడ్డి, తహసీల్ధార్ రామారావు, హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ అవినీతిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని మాట్లాడారు. సింగరేణి ఓపెన్ కాస్ట్, అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సింగరేణి పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
కాళేశ్వర దేవస్థాన క్యాలెండర్ ఆవిష్కరణ
కాళేశ్వర దేవస్థాన క్యాలెండర్ ఆవిష్కరణ
కాళేశ్వర దేవస్థాన క్యాలెండర్ ఆవిష్కరణ


