వైభవంగా గోదారంగనాథుల కల్యాణం
భూపాలపల్లి అర్బన్: ధనుర్మాసం, సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ ఆలయాల్లో బుధవారం శ్రీగోదారంగనాథ స్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. తొలుత స్వామివార్లు ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించగా వేలాది మంది తరలివచ్చి చూసి పులకించిపోయారు. పలువురు ప్రముఖులు హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొదండరామాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు.
వైభవంగా గోదారంగనాథుల కల్యాణం


