‘కొడవటంచ’ పనులు త్వరగా పూర్తి చేయాలి
రేగొండ: కొడవటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు. బుధవారం కొడవటంచ ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి నెలలో స్వామి వారి పునఃప్రతిష్ఠ, బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు బాలాలయంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భిక్షపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. గౌడ కులస్తుల ప్రభుత్వ ఉ ద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యా లెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


