‘మండమెలిగె’కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘మండమెలిగె’కు సర్వం సిద్ధం

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

‘మండమెలిగె’కు సర్వం సిద్ధం

‘మండమెలిగె’కు సర్వం సిద్ధం

‘మండమెలిగె’కు సర్వం సిద్ధం నేడు మేడారం దిగ్బంధం

దుష్టశక్తుల చూపుపడకుండా..

బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026

భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు

ఎస్‌ఎస్‌ తాడ్వాయి : మహాజాతరలో భాగంగా మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో నేడు (బుధవారం) జరగనున్న మండమెలిగె పండుగకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు వారాలముందు గుడిమెలిగె పండుగతో తొలిఘట్టం పూజలు ప్రారంభం కాగా, సరిగ్గా వారం రోజులముందు నిర్వహించే ఈ మండమెలిగె పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం మేడారం, కన్నెపల్లి వనదేవతల ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆలయాలు, అమ్మవారి పూజా సామగ్రి (మువ్వలు, గంటలు, వస్త్రాలు, ఊత కొమ్ములు) శుద్ధి చేయనున్నారు. ముగ్గులతో ఆడపడుచులు సుందరంగా అలంకరిస్తారు. పూజారులు ఉదయాన్నే తలంటుస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరి స్తారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ధూపదీపాలు వెలిగించి ఆచారసంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు.

మండమెలిగె పండుగ సందర్భంగా పూజారులు మేడారాన్ని బుధవారం అష్ట దిగ్బంధం చేయనున్నారు. ముందుగా నిష్టతో నులకతాడు తయారు చేసి దానికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో అమ్మవార్లను తీసుకువచ్చే ప్రధాన రహదారుల వద్ద బూర్కకర్ర(ముళ్లతో కూడుకున్న పచ్చికర్రలు)లకు మామిడి తోరణాలు కట్టి నిలుపుతారు. ఎలాంటి దుష్టశక్తుల చూపు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పూజారులు ఆనవాయితీగా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement