నేడు మంత్రి తుమ్మల రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి తుమ్మల రాక

Jan 24 2026 7:25 AM | Updated on Jan 24 2026 7:25 AM

నేడు

నేడు మంత్రి తుమ్మల రాక

కాళేశ్వరాలయంలో జడ్జిల పూజలు ప్రతీ ఒక్కరికి పని కల్పించాలి

భూపాలపల్లి రూరల్‌: నేడు (శనివారం) జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 11:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో సుందరీకరణ పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

భూపాలపల్లి అర్బన్‌: ఆర్టీసీ సమస్యలపై నేడు (శనివారం) డయల్‌ యువర్‌ ఆర్టీసీ డీఎం నిర్వహించనున్నట్లు డీఎం ఇందూ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుస్తులు, విద్యార్థులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 99592 26707 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని భూపాలపల్లి జిల్లా జడ్జి సీహెచ్‌.రమేష్‌బాబు, ములుగు జిల్లా జడ్జి సూర్యచంద్రకళ, సీనియర్‌ సివిల్‌ జడ్జి కన్యాలాల్‌ దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ రాజగోపురం వద్ద వారిని ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద జడ్జిలకు అర్చకుడు వెల్ది శరత్‌చంద్ర శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట ఎస్సై తమాషారెడ్డి తదితరులు ఉన్నారు.

మొగుళ్లపల్లి: జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉపాధిహామీ పని కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ పూడిక తీత పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పని వద్ద తప్పని సరిగా నీడ, తాగు నీరు, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాధవి, ఈసీ రాము, టీఏ శ్రావణ్‌కుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమేష్‌ పాల్గొన్నారు.

జాతర పనుల పరిశీలన

మొగుళ్లపల్లి–ముల్కలపల్లి మధ్యలో సమ్మక్క సారళమ్మ జాతర ప్రాంగణంలో జరిగే అభివృద్ధి పనులు, ఏర్పాట్లను జాతర ప్రత్యేకాధికారి బాలకృష్ణ పరిశీలించారు. సర్పంచ్‌ విజయ, అధికారులతో మాట్లాడారు.

నేడు మంత్రి తుమ్మల రాక 
1
1/1

నేడు మంత్రి తుమ్మల రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement