మేడారానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

మేడారానికి పోటెత్తిన భక్తులు

Jan 25 2026 7:21 AM | Updated on Jan 25 2026 7:21 AM

మేడార

మేడారానికి పోటెత్తిన భక్తులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో సుమారు 50 వేల మంది వరకు భక్తుల తరలి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించారు. శివసత్తుల పూనకం, భక్తిగీతాల ఆలాపాన, భక్తుల సందడితో జంపన్న వాగు కోలాహలంగా మారింది. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె సమర్పించి చల్లగా చూడాలని భక్తులు తల్లులను వేడుకున్నారు. అనంతరం అడవిలో చెట్లకింద వంటలు వండుకొని భోజనాలు చేశారు.

మేడారంలో

కలెక్టర్‌ దంపతులు

భూపాలపల్లి రూరల్‌: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను కలెక్టర్‌ రాహుల్‌ శర్మ దంపతులు శనివారం దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ వీరస్వామి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎత్తు బంగారం సమర్పించారు. దర్శించుకున్న వారిలో కలెక్టర్‌ దంపతులతో పాటు కలెక్టర్‌ తల్లిదండ్రులు ఉన్నారు.

ఘనంగా జాతీయ

బాలికా దినోత్సవం

భూపాలపల్లి రూరల్‌: జిల్లాకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శనివారం శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీడీఓ శైలజ మాట్లాడుతూ బాలిక కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగే వరకు వారికి సంక్షేమ శాఖ అండగా నిలుస్తుందన్నారు. అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా బాలికలకు పౌష్టికాహారం అందించాలని చెప్పారు. జెండర్‌ స్పెషలిస్ట్‌ అనూష మాట్లాడుతూ పిల్లలలో ఏకాగ్రత, పోటీతత్వం, సమన్వయం తప్పకుండా ఉండాలన్నా రు. బాలికలు వివక్షకు గురైతే ప్రశ్నించాలన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన బాలికలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత సిబ్బంది మమత, సురేష్‌, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

మేడారానికి పోటెత్తిన భక్తులు1
1/3

మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు2
2/3

మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు3
3/3

మేడారానికి పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement