సారలమ్మ వచ్చిందిలా..
మంగళవారం మధ్యాహ్నం 4:23కు పూనుగొండ్ల నుంచి బయల్దేరాడు.
రాత్రి 1 గంటలకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాడు.
బుధవారం ఉదయం 11:23 గంటలకు పస్రా చేరుకున్నాడు.
సమ్మక్క గుడికి రాత్రి 7:23కు చేరుకున్నాడు.
12:29 గంటలకు గద్దైపె పగిడిద్దరాజును ప్రతిష్ఠించారు.
కొండాయి నుంచి 5:57 గంటలకు పడిగ రూపంలో బయలుదేరాడు.
6:40 గంటలకు కొండాయి ఊరిపొలిమేర దాటారు.
8:20 గంటలకు జంపన్నవాగు దాటారు.
9:20 గంటలకు మేడారం జంపన్నవాగుకు చేరుకున్నారు.
12:29 గంటలకు గద్దెలపై ప్రతిష్ఠించారు.
రహస్య పూజలు లోపల.. డోలు వాయిద్య గంభీర ధ్వనులు బయట. పూజారుల మంత్రాల ఉచ్ఛరణ లోపల.. ఆదివాసీల ఆటపాటలు బయట. పసుపు కుంకుమలతో ఆడబిడ్డకు కొలుపు లోపల. నీళ్లారగించేందుకు నిరీక్షించే ఆడపడుచులు బయట. తరలివచ్చేందుకు సిద్ధమైన తల్లి లోపల.. పాద స్పర్శ కోసం వరంపట్టే బిడ్డలు బయట.. ఇలా.. కన్నెపల్లి నుంచి బుధవారం రాత్రి ఆదివాసీ సంప్రదాయంతో సారలమ్మ మేడారానికి బయలెల్లింది.
ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వరాల తల్లి సమ్మక్క గురువారం వనం వీడి జనం మధ్యలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ప్రధాన పూజారులు చిలకలగుట్టపైన ప్రత్యేకంగా రహస్య పూజలు నిర్వహించి గుట్టమీద నుంచి దిగుతారు. గుట్ట దిగే సమయంలో ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి శ్రీకారం చుడతారు. డోలువాయిద్యాలు, కొమ్ము బూర శబ్దాలు, ధూపం, పోలీస్ బందోబస్తు, రోప్‌పార్టీ నడుమ అమ్మవారిని గుట్ట నుంచి మేడారం గద్దెల వైపు తీసుకొస్తారు. గుట్టకు గద్దెలకు మధ్యలో ఉన్న ఎదురుకోళ్ల మండపంలోకి తీసుకొచ్చి అక్కడ ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. మేడారం ఆడబిడ్డలు సమ్మక్క తల్లికి ఎదురెళ్లి నీళ్లను ఆరబోసి స్వాగతం పలుకుతారు. సమ్మక్కను మేడారంలోని సమ్మక్క గుడిలోకి శక్తిపీఠం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుడి నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో గుడిలోని విద్యుత్ దీపాలను నిలిపివేస్తారు. సమ్మక్క ఆగమనం సమయంలో వేలాది మంది భక్తులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు మేకపోతులు, కోళ్లను బలిచ్చి స్వాగతం పలుకుతారు. అమ్మవారి నడిచే దారిలో అడుగడుగున రంగులతో ముగ్గులు వేస్తారు.
చిలకలగుట్టపై పూజలు..
సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపై మంగళవారం సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లతో గుట్టపైకి వెళ్లి అక్కడ శాంతించే విధంగా పూజలు నిర్వహించారు. సమ్మక్క వచ్చే దారిని గుట్ట నుంచి ప్రధాన గేటు వరకు శుభ్రం చేశారు. సమ్మక్క ఆగమనానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేశారు.
రాత్రి 7 గంటలకు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోకి పూజారులు వెళ్లారు.
7:19 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెళ్లి పూజలు చేశారు.
రహస్య పూజల అనంతరం..
7:38 గంటలకు పూజారులు బయటకు వచ్చారు.
7:40 గంటలకు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
7:42 గంటలకు సారలమ్మకు నిమ్మకాయలతో దిష్టి తీశారు.
8:51 గంటలకు జంపన్నవాగుకు చేరుకున్నారు.
12:28 గంటలకు గద్దైపె సారలమ్మను ప్రతిష్ఠించారు.


