సమస్యల పరిష్కారానికి భూ సర్వేలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి భూ సర్వేలు

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

సమస్యల పరిష్కారానికి భూ సర్వేలు

సమస్యల పరిష్కారానికి భూ సర్వేలు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి జిల్లాలోని 13 గ్రామాల్లో రీ–సర్వేకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రెవెన్యూ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూ సర్వే చట్టం సెక్షన్‌ 5(1), 6(1) కింద గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసి, జిల్లాలో తొలి దశగా మొత్తం 13 గ్రామాల్లో రీ–సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఈ గ్రామాల్లో సర్వే ద్వారా పొలాల గట్టు హద్దులు, రోడ్లు, చెరువులు, కాల్వలు, గ్రామ కంటం భూములు తదితరాలను గుర్తించి, శాసీ్త్రయ పద్ధతిలో హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కుసుమ కుమారిలు పాల్గొన్నారు.

ఉచిత ఉద్యోగ శిక్షణ

టీజీఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం శిక్షణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19వ తేదీ వరకు నిర్వహించే శిక్షణకు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్‌ అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారిణి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు భద్రత ప్రతీఒక్కరి బాధ్యత

భూపాలపల్లి: రోడ్డు భద్రత ప్రతీఒక్కరి బాధ్యతని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అరివ్‌ అలైవ్‌ క్యాంపెయిన్‌–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మినర్సింహా ఫంక్షన్‌ హాల్‌లో శ్రీమీడియా అవుట్‌ రీచ్‌ డేశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, అతివేగాన్ని అరికట్టేందుకు త్వరలోనే స్పీడ్‌గన్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎస్పీ సంకీర్త్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్‌ అవర్‌ (ప్రమాదం జరిగిన మొదటి గంట)లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి గుడ్‌ సమరిటన్‌ కింద రూ.25,000 నగదు బహుమతి అందజేస్తామన్నారు. అనంతరం రోడ్‌ సేఫ్టీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, డీఎస్పీ సూర్యనారాయణ, భూపాలపల్లి సీఐ డి.నరేష్‌కుమార్‌, డీటీఓ సంధాని, ఆర్టీసీ డీఎం ఇంధూ, డ్రైవర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement