ఘనంగా బొమ్మల కొలువు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బొమ్మల కొలువు

Jan 22 2026 7:17 AM | Updated on Jan 22 2026 7:17 AM

ఘనంగా

ఘనంగా బొమ్మల కొలువు

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలోని ఇల్లంద క్లబ్‌హౌస్‌లో బుధవారం లేడీస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో క్లబ్‌ అధ్యక్షురాలు ఏనుగు సునీతారాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన బొమ్మల కొలువు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్‌) ఎల్‌వీ సూర్యనారాయణ సతీమణి మాలతి, డైరెక్టర్‌ (ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌) వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి, డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) తిరుమలరావు సతీమణి పద్మలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొమ్మల కొలువులో గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను ప్రతిభింబించేలా వివిధ రకాల బొమ్మలు, కళాకృతులు, దృశ్య రూపకల్పనలు అందంగా అమర్చారు. ముఖ్యంగా వ్యవసాయ జీవనం, గ్రామీణ మహిళల జీవన విధానం, సంప్రదాయ పండుగల దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి లేడీస్‌ క్లబ్‌ సభ్యులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై బొమ్మల కొలువును తిలకించారు.

ఘనంగా బొమ్మల కొలువు1
1/1

ఘనంగా బొమ్మల కొలువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement