పోరాట స్ఫూర్తిని నింపాలి
భూపాలపల్లి: భవిష్యత్ తరాలకు స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నింపాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని, వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టులో..
భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాపోటీల్లో విజేతలైన కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్.దిలీప్‌కుమార్‌నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసచారి, శ్రావణ్‌రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, పోక్సో స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, అదనపు గవర్నమెంట్ ప్లీడర్లు బల్ల మహేందర్, ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు.
గణపురం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో జాతీయ జెండా రూపంతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి సోమవారం ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా రూపంలో అలంకరించగా భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
31 వరకు
ఇసుక రీచ్‌లు బంద్
కాళేశ్వరం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతర సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచులను కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాలతో నేటి నుంచి ఈనెల 31వరకు బంద్ చేసినట్లు టీజీఎండీసీ పీఓ రామకృష్ణ సోమవారం తెలిపారు. జాతర సమయంలో భక్తులు భారీగా తరలి రానున్నందున ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఇసుక రీచులు బంద్ చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి యథావిధిగా ఇసుక రీచ్‌లు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
పోరాట స్ఫూర్తిని నింపాలి
పోరాట స్ఫూర్తిని నింపాలి


