‘భూపాలపల్లి’ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం రూ.2 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో 5 ఇంకై ్లన్ ఆర్చ్ నుంచి భాస్కర్ గడ్డ వైపు బీటీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.1.50 కోట్లతో భాస్కర్ గడ్డ పోష మ్మ దేవాలయం నుంచి వేషాలపల్లి డబుల్ బెడ్‌రూం వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని 30 వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, సీసీ రోడ్లు, సైడ్ డ్రెయినేజీలు ఏర్పాటు చేసి పట్ట ణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, బుర్ర కొమరయ్య, మహేందర్, మేరా సురేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రూ.5.50కోట్ల అభివృద్ధి పనులకు
శంకుస్థాపన


