మేడారం జాతర బస్సు ప్రారంభం
మల్హర్(కాటారం): కాటారంలో మేడారం జాతర స్పెషల్ బస్సును భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో డీఎం బస్సును ప్రారంభించి మాట్లాడారు. మేడారం జాతర కోసం ఏర్పాటుచేసిన బస్సును మేడారానికి వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో సూపర్‌వైజర్లు రాంప్రసాద్, జీఆర్‌రెడ్డి, సర్పంచ్‌లు పంతకాని సడవలి, ఊర వెంకటేశ్వరరావు, కాటారం ఉపసర్పంచ్ కొండగొర్ల బానయ్య, మానేం రాజబాపు, బుర్ర లక్ష్మణ్, మంత్రి సునీల్ తదితరులు పాల్గొన్నారు.


