జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

Jan 27 2026 8:14 AM | Updated on Jan 27 2026 8:14 AM

జిల్ల

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

మహిళా సాధికారతకు కృషి

మహిళా సాధికారత..

ఉత్తములకు అవార్డులు

– మరిన్ని వార్తలు, ఫొటోలు 9లోu

భూపాలపల్లి: పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ హాజరు కాగా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులతో గౌరవ వందనం స్వీకరించి.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మెరుగైన వైద్యం..

పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. జిల్లాలో 39,605 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఇందుకోసం రూ. 88.13 కోట్లు వెచ్చించాం. జిల్లాలో 65 పల్లె దవాఖానాలు, మహదేవపూర్‌లో డయాలసిస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు అందించాం. మహిళా క్యాంపులు నిర్వహించి 5,690 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం.

రైతు సంక్షేమం.. వ్యవసాయం..

రైతు భరోసా కింద 1.24 లక్షల మంది రైతులకు రూ. 96 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ రైతులపై ఆర్థిక భారం తగ్గించాం. రైతు బీమా కింద 72,058 మందిని నమోదు చేశాం. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రభుత్వం అందిస్తుంది.

గృహజ్యోతి.. ఇందిరమ్మ ఇళ్లు..

గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే 56,525 మంది వినియోగదారులకు ప్రభుత్వం రూ.37.42 కోట్లు చెల్లించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాకు 3,943 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.51.40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకం ద్వారా 68,311 మంది లబ్ధి పొందుతున్నారు.

సన్నబియ్యం పంపిణీ, పట్టణ అభివృద్ధి..

జిల్లాలో నూతనంగా 15,149 రేషన్‌ కార్డులు మంజూరు చేశాం. పాఠశాలలు, అంగన్‌వాడీలకు పోర్టి ఫైడ్‌ సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.113 కోట్లతో పనులు చేపట్టామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వెల్లడించారు.

అలరించిన కార్యక్రమాలు..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. పలు ప్రభు త్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాటా రం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ శర్మ,

ప్రసంగిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

విద్యార్థుల నృత్యాలు

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు

వ్యవసాయ రంగానికి పెద్దపీట

పేదల సొంతింటి కల

సాకారం చేస్తున్నాం

గణతంత్ర వేడుకల్లో రాహుల్‌ శర్మ

మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చింది. జిల్లాలో ఇప్పటివరకు 1.85 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనివలన వారికి రూ. 97.43 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. మహిళా శక్తి పథకం కింద 2,378 సంఘాలకు రూ. 240 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం.

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం1
1/4

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం2
2/4

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం3
3/4

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం4
4/4

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement