మేడారం టు కాళేశ్వరం
● మేడారం భక్తులతో కిక్కిరిసిన
కాళేశ్వరాలయం
కాళేశ్వరం: ములుగు జిల్లా మేడారంలో మొక్కులు చెల్లించిన భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరాలయాన్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భక్తులతో పాటు తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే భక్తులు కాళేశ్వరాలయంలో స్వామివారికి పూజలు చేశారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శని త్రయోదశి సందర్భంగా నవగ్రహాల వద్ద భక్తులు శనిపూజలు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
మేడారం టు కాళేశ్వరం


