సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : ఈనెల 18న సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శనివారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతలు, బందోబస్తు ఏర్పాట్లు, ప్రొటోకాల్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. సీఎం పర్యటన సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మేడారంలో మ్యూజియం, ఆర్టీసీ పార్కింగ్ స్థలాలు, టెంట్ సీటీ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


