ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: వాహనదారులు, ప్రజలు ట్రా ఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. స్థానిక మై నార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ద్విచక్ర వాహనాల ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న చిన్న తప్పిదాలను సరిదిద్దుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రవి, ఏఎంవీఐలు శ్రీనివాస్, సుందర్‌లాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా రవాణా శాఖ అధికారి
మహమ్మద్ సంధాని


